ఆ దేశ అధ్యక్షుడు రక్తంతో స్నానం చేస్తాడని మీకు తెలుసా…!

నిత్యం వివాదాలతో సహవాసం చేసే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి ఆ దేశ మీడియా సరికొత్త విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయాన్ని విన్నవారు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రోజూ స్నానం రక్తంతో చేస్తారట. పుతిన్ తన లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి రాయల్ స్టాగ్ (దుప్పి) కొమ్ముల నుండి తీసిన రక్తంతో స్నానం చేస్తారని ఆ దేశ మీడియా బయటపెట్టింది.

గత ఏడాది పుతిన్ స్నానం చేయడానికి 70 కిలోల దుప్పి కొమ్ములు సేకరించారని ఆ దేశ మీడియా  తీవ్రంగా విమర్శించింది. రష్యాలో కోట్లలో ఈ రక్తం వ్యాపారం జరుగుతుంటుంది. దీని ఖరీదు కూడా భారీగానే ఉంటుంది. కేవలం 10 మిల్లీలీటర్ల రక్తం 100 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. రాయల్ స్టాగ్ (దుప్పి) కొమ్ముల నుండి తీసిన రక్తంతో చాలా రకాల శారీరక సమస్యలు నయమౌతాయని అక్కడి వారి నమ్మకం. దీంతో అక్కడి జనం వీటి రక్తాన్ని వాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది ఆ రక్తంతో స్నానం చేస్తే మరికొంతమంది ఈ రక్తంతో స్నానం కూడా  చేస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*