ఆయన ఓకే అంటే వచ్చే వారమే చైనా పై అణుదాడి చేస్తాం…!

మొత్తానికి చైనా అందరితోనూ గిల్లికజ్జాలు పెట్టుకుని తన దేశ అస్తిత్వాన్ని కోల్పోతుంది. తన మాట కాదన్న వారినందరినీ చైనా తన శత్రువులాగానే చూస్తుంది. చైనా పద్దతి చూస్తుంటే ఆ దేశం తప్ప ఇంకే దేశం అభివృద్ధి చెందకూడదని కుటిల ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా, భారత్ లతో కూడా పెట్టుకుంటుంది. దీనిపై అమెరికా చాలా సీరియస్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమతి ఇస్తే వచ్చే వారమే చైనా పై అణుదాడికి దిగుతామంటూ అమెరికా ఫసిఫిక్ రేంజ్ కమాండర్ ఆడమ్ స్కాట్ స్విఫ్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొద్దిరోజుల క్రితం చైనా తన పరిధులు దాటి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ తీరంలోకి యుద్ధ నౌకలను పంపిందని, అలాగే అమెరికా యుద్ధ విమానాలకు అతి సమీపంలోకి తన యుద్ధ విమానాలను తీసుకొచ్చి వాటిని పేల్చేసే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. ఎవరైనా అమెరికా జోలికి కానీ, అమెరికా మిత్ర దేశాల జోలికి కానీ వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి అమెరికన్ సైనికుడు అమెరికా రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*