జోరు చూపిస్తున్న కళ్యాణ్ రామ్

ఒకప్పటిలా కాకుండా ఇప్పటి యువ హీరోలు ఒక సినిమా చేస్తుండగానే మరొక సినిమా మొదలు పెట్టేస్తున్నారు. 2సంవత్సరాల క్రితం వరకు మన తెలుగు హీరోలందరూ ఒక సినిమా విడుదలై రిజల్ట్ వచ్చే వరకు తర్వాత సినిమా గురించి ఆలోచించే వారే కాదు. దాంతో ఇండస్ట్రీ సంవత్సరంలో సగం రోజులు వెలవెలబోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యువ హీరోలంతా చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు కళకళలాడుతుంది.

తాజాగా హీరో కళ్యాణ్ రామ్ ఉపేంద్ర మాధవన్ దర్శకత్వంలో ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే మరొక సినిమాను ప్రారంభించేసాడు. దర్శకుడు జయేంద్ర డైరెక్షన్ లో తన కొత్త సినిమాను ఈ రోజే లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ, దర్శకుడు క్రిష్, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సినిమాలో మలయాళ మలయాళ నటి ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*