యూనిట్ మొత్తం వణికిపోతున్నా… రవితేజ మాత్రం ఎంజాయ్ చేసాడు

మాస్ మహారాజ్ రవితేజ అంటే ఉత్సాహానికి మారుపేరు. ఆయన ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశం మొత్తం ఆనందంతో నిండిపోతుంది. ఈ మధ్య ఆయన అనేక సమస్యల్లో ఇరుక్కుపోయినపుడు కూడా ఆయనలో ఎక్కడా బెరుకు కానీ, భయం కానీ కనపడలేదు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలామంది హీరోయిన్లు రవితేజ గురించి, ఆయన షూటింగ్ చేసే సమయంలో చేసే అల్లరి గురించి చెప్పారు. ఇప్పుడు ఆ లిస్టులో మెహరీన్ కౌర్ కూడా చేరిపోయింది.

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సందర్భంగా మెహరీన్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజను ఆమె ఆకాశానికి ఎత్తేసింది. ‘రవితేజ ఎప్పుడూ చాలా హుషారుగా ఉంటారని, ఆయన ఏ విషయానికైనా వణికిపోవడం, బాధ పడడం చూడలేదని’ ఆమె చెప్పింది. ‘ డార్జిలింగ్ లో షూటింగ్ జరిగేటప్పుడు యూనిట్ మొత్తం చలితో వణికిపోతే… రవితేజ మాత్రం ఆ చలిని కూడా ఎంజాయ్ చేసారని… పైగా అలాంటి వాతావరణం హైదరాబాద్ లో ఉండదు కదా అని అన్నారని, జీవితంలో మంచైనా, చెడైనా ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే రవితేజ ఫిలాసఫీ’ అని ఆమె చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*