భారత్ పై అణుబాంబులు వేద్దామనుకున్నాం కానీ… అందుకే వేయలేదు

1999లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను అధికారం నుండి దించేసి 2001 నుండి 2008 వరకు ముషారఫ్ పాక్ సైనిక పాలకునిగా కొనసాగాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. దీనితో ఆయన వైద్యం చేయించుకోవడానికి దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ లో ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. 2001లో భారతదేశంపై అణుబాంబులు వేద్దామని అనుకున్నామని అయితే భారత్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయని అలోచించి వెనుకంజ వేశామని అన్నాడు.

2001లో భారత దళాలు పాక్ సరిహద్దుల వద్ద మొహరించాయని అప్పుడు పాక్ కూడా యుద్దానికి సిద్ధమైందని అన్నాడు. ఒకానొక సమయంలో భారతదేశంపై అణుబాంబులు వేద్దామనుకున్నామని అయితే భారత్ దగ్గర కూడా అణుబాంబులు ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చిందని ముషారఫ్ చెప్పాడు. అప్పట్లో క్షిపణులకు అణు వార్ హెడ్లను బిగించే సామర్థ్యం పాకిస్తాన్ కు లేదని కానీ అనుకుంటే ఈ కార్యక్రమం రెండు మూడు రోజుల్లో పూర్తయి ఉండేదని ముషారఫ్ చెప్పాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*