మళ్ళీ ప్రభాస్, రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారా…?

రాజమౌళి, ప్రభాస్ వీరిద్దరి పేర్లు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ‘బాహుబలి’ సినిమా. బాహుబలి సిరీస్ తో వీళ్లిద్దరికీ ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ బాహుబలి సినిమా తీసే సమయంలోనే రాజమౌళి ప్రభాస్ కు ఒక కథ చెప్పాడంట. అది ప్రభాస్ కి కూడా బాగా నచ్చిందంట. అయితే ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ మూవీ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నాడు. దాని తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్త్తి చేయడానికి ప్రభాస్ కి సంవత్సరం పైగానే సమయం పడుతుంది.

ఈ సమయంలో రాజమౌళి కూడా ఒక సినిమా తీయాలి అనుకుంటున్నట్టు సమాచారం. ఆ తర్వాత వీరిద్దరూ ఖాళీ అయ్యాక రాజమౌళి చెప్పిన కథను సినిమాగా తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కథ రాజులు, యుద్దాలు లాంటిది కాదని పక్కా కమర్షియల్ స్టోరీ అని అనుకుంటున్నారు. ఈ వార్తలు విన్న ప్రభాస్, రాజమౌళి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాహుబలి తో ప్రపంచం మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల వైపు చూసేట్టు చేసిన వీరిద్దరూ తర్వాత సినిమాతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*