అక్కడ అత్యాచారానికి అత్యాచారమే శిక్ష…!

పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని రోజురోజుకీ పాతరేస్తున్నారు అక్కడి జనం. కన్నుకు కన్ను అన్నట్టుగా అత్యాచారానికి అత్యాచారం అన్నట్టు అక్కడి పరిస్థితులు దిగజారిపోయాయి. ఒక యువతిపై అత్యాచారం చేసిన యువకుడి సోదరిపై అతని కుటుంబ సభ్యులు చూస్తుండగానే అత్యాచారం చేయాలనీ అక్కడి పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్ ముల్తాన్ డివిజన్ లోని రాజపూర్ గ్రామంలో ఈ నెల 18న ఈ నీచమైన సంఘటన చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన అస్ఫక్ అనే యువకుడు ఈ నెల 16న ఉమర్ వాదా అనే యువకుడు తన సోదరిపై అత్యాచారం చేసాడని పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసాడు. దీంతో విచారణ చేపట్టిన పంచాయతి పెద్దలు అందరూ చూస్తుండగా వాదా సోదరిని (16) అస్ఫక్ అత్యాచారం చేయాలని తీర్పు చెప్పారు. ఈ ఘటనను ఆమె తల్లితండ్రులు కూడా చూడాలని ఆర్డర్ వేశారు. వాదా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా బలవంతంగా శిక్షను అమలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అస్ఫక్ తో సహా పంచాయతీ పెద్దలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*