తీవ్ర గాయాలతో ఐసీయూ లో మంచు విష్ణు

కెరీర్ బిగినింగ్ లో ‘ఢీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మంచు విష్ణు ఆ తర్వాత కొన్ని ప్లాప్ సినిమాలతో వెనకపడ్డాడు. ఇప్పుడు ఏది ఏమైనా సరే ఒక్క హిట్ కొట్టాలని కసితో ఉన్న మంచు విష్ణు ప్రస్తుతం ‘ఆచారి అమెరికా యాత్ర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా మంచు విష్ణు బైక్ నుండి పడిపోయాడు. దీంతో విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం విష్ణు మలేషియా లోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నట్టు తెలుస్తుంది. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మలేసియాలో జరుగుతుంది. ఈ సినిమాలో ఒక బైక్ ఛేజింగ్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*