నేనే నంబర్ 1 అంటున్న ఆమెజాన్ వ్యవస్థాపకుడు

ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు ఎవరు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చే పేరు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఆయన ఈ లిస్ట్ లో చాలా సంవత్సరాల నుండి నంబర్ 1 స్థానంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొలదీ కొత్త కోటీశ్వరులు పుట్టుకొస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని వీళ్ళు చేస్తున్న వ్యాపారాలు వీళ్ళని అమాంతం కుబేరులను చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ ధనవంతుల లిస్ట్ లో బిల్ గేట్స్ ను కూడా వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించాడు ఆమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.

ఆర్ధిక ఫలితాల వెల్లడికి ముందు ఆమెజాన్ షేర్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో బెజోస్ సంపద నికర విలువ 90.9 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం బిల్ గేట్స్ ఆస్తుల విలువ 90.7 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఇప్పటివరకు బెజోస్ సంపద విలువ 10.2 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఆమెజాన్ ఆయనకు 17 శాతం వాటా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 500 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది. అంతేకాకుండా పేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంపద విలువ కూడా భారీగానే పెరిగింది. ఆయన సంపద విలువ ప్రస్తుతం 72.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*