త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న నిఖిల్.. అమ్మాయి ఎవరో తెలుసా…?

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు యువ హీరో నిఖిల్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అతనికి కాలం కలిసి రాలేదు. కొన్ని సంవత్సరాలు అతను హిట్ అనే మాటనే మర్చిపోయాడు. అప్పటివరకు రొటీన్ సినిమాలు చేసిన నిఖిల్ గత కొన్ని సంవత్సరాల నుండి కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుని, యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు నిఖిల్ మనసు పెళ్లి వైపు లాగినట్టు తెలుస్తుంది.

తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో ఒకడైన నిఖిల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. నిఖిల్ దగ్గరి బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయితో నిఖిల్ వివాహం జరగబోతున్నట్టు తెలుస్తుంది. తేజస్విని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆంజనేయులు కుమార్తె. ఈ నెల 24న నిశ్చితార్ధం, అక్టోబర్ మొదటి వారంలో వివాహం జరపనున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తను ఇంకా ఇరు కుటుంబాల వారుప్రకటించాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*